అందరూ ఊహించినట్టే సమంత (Samantha) తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరు (Raj Nidumoru)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి వెనుక ఎన్నో మిస్టరీలు కథనాలు వస్తున్నాయి. భూతశుద్ధి వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన సామ్ కి సంబంధించిన ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సమంత పెళ్లి ఫొటోల్లో తన వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని స్పెషల్ గా పోస్ట్ చేసింది. అయితే ఇదే ఉంగరం వేలికి పెట్టుకుని ఫిబ్రవరి 13న వాలంటైన్స్ డేకు ముందు సామ్ పోస్ట్ చేసింది. కానీ అప్పుడు దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పెళ్లి సందర్భంగా రాజ్ తో మరోసారి అదే ఉంగరాన్ని సమంత హైలెట్ చేసింది.
అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ (Samantha – Raj) ల ఎంగేజ్ మెంట్ సీక్రెట్ గా జరిగిందేమో అంటున్నారు. అప్పటి ఫొటోల్లో కూడా సమంత సేమ్ అదే వేలికి అదే ఉంగరాన్ని పెట్టుకుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఫిబ్రవరి తర్వాత నుంచే వీరిద్దరూ బయట తిరగడం స్టార్ట్ చేశారు. క్లోజ్ గా ఉంటూ ఫొటోలు కూడా దిగుతున్నారు. అంతకు ముందు వీరిద్దరూ పెద్దగా బయట కనపించలేదు. దీన్ని బట్టి ఫిబ్రవరిలోనే ఎంగేజ్ మెంట్ చేసుకుని సరైన ముహూర్తం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారేమో అంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా సమంత రాజ్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది కాబట్టి ఆమె లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
Read Also: ఆడపిల్లల రక్షణ కోసం ఇందూరు యువకుడి సాహసయాత్ర
Follow Us On: X(Twitter)


