Mobile Popup Ad
Mobile Popup Ad

అక్క‌డంతా రివ‌ర్స్.. ఎమ్మెల్యే అభ్య‌ర్థికే డ‌బ్బులు ఇస్తున్న ఓట‌ర్లు!

క‌లం, వెబ్ డెస్క్‌: సాధార‌ణంగా ఎన్నిక‌లంటే ఎంతో ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. చిన్న గ్రామ వార్డు స‌భ్యుడి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే వ‌ర‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే ఎంతో డ‌బ్బు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. పార్టీ ఫండింగ్ ఎంత ఉన్నా అభ్య‌ర్థులు త‌మ సొంత డ‌బ్బు ఖ‌ర్చు చేస్తే కానీ ఓట్లు రాల‌వు. కానీ ప‌శ్చిమ‌ బెంగాల్ (West Bengal Elections) ఎన్నిక‌ల్లో సీన్ రివ‌ర్స్ అన్న‌ట్లుగా ఉంది ప‌రిస్థితి. బెంగాల్‌లోని శ్యామ్‌పుకూర్ (Shyampukur) అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పూర్ణిమా చక్రవర్తి (Purnima Chakraborty) ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. జ‌నం కాళ్లు మొక్కుతూ త‌న‌కే ఓటు వేయాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు వెళ్తున్న ఆమెకు పూల దండ‌లు వేస్తూ ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం చెప్తున్నారు. అంతే కాకుండా ఆమెకు డ‌బ్బులు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సాధార‌ణంగా ఎక్క‌డైనా నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతారు కానీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లే నేత‌కు డ‌బ్బులు ఇవ్వ‌డంపై నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు.

Read Also: అస్సాం సీఎం భార్యకు దుబాయ్ లో ఆస్తులు.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>