కడప జిల్లా వేంపల్లిలో ఆర్టీసీ బస్సుకు మంటలు

కలం, వెబ్ డెస్క్ : కడప(Kadapa) జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వేంపల్లి (Vempalli) మండలం వీరన్న గట్టుపల్లి వద్ద 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు మంటల్లో (RTC Bus Fire) చిక్కుకుంది. కదిరి డిపోకు చెందిన ఈ బస్సు వేంపల్లి నుంచి కదిరి వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు మీదుగా వెళ్లిన విద్యుత్ తీగలు.. తగిలిన వెంటనే మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బస్సులో ఉన్న వారు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.

అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొత్తం 18 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను (RTC Bus Fire) అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: తిరుపతి జిల్లా శేషాపురం పరిసరాల్లో ఏనుగుల హల్‌ చల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>