కలం, వెబ్ డెస్క్: భద్రాచలం (Bhadrachalam) సమీపంలో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రహోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. భద్రాచలం సమీపంలోని గ్రామాలు ప్రస్తుతం భౌగోళికంగా, సామాజికంగా భద్రాచలంతోనే అనుసంధానమై ఉన్నాయని తుమ్మల లేఖలో విరించారు. ఆ గ్రామాలు ఏపీలో ఉండటం వల్ల పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు.
గిరిజనులు ఆరోగ్యం, విద్య, రవాణా వంటి ప్రాథమిక సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరారు. ఈ ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేస్తే ప్రభుత్వ పథకాల అమలు సులభమవుతుందని ఆయన (Tummala) లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు వెంటనే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనూ విలీనం బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు.
Read Also: అక్కడంతా రివర్స్.. ఎమ్మెల్యే అభ్యర్థికే డబ్బులు ఇస్తున్న ఓటర్లు!
Follow Us On: Instagram

