అస్సాం సీఎం భార్యకు దుబాయ్ లో ఆస్తులు.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

కలం, వెబ్ డెస్క్ : అస్సాం అసెంబ్లీ ఎన్నికల (Assam Elections 2026) ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అధికార బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్ మాటల తూటలు, విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ పబ్లిసిటీ డిపార్డ్ మెంట్ చైర్మన్ పవన్ ఖేరా కీలక విషయాలను వెల్లడించారు. అస్సాం (Assam) సీఎం హిమంత బిశ్వ శర్మ ఎన్నికల అఫిడవిట్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం భార్య రింకి భుయాన్ శర్మ (Riniki Bhuyan Sarma) పేరు మీద దుబాయ్ లో రెండు ఆస్తులున్నాయని చెబుతూ మీడియా ఎదుట ఆధారాలు ప్రదర్శించారు. అయితే, వీటిని సీఎం హిమత బిశ్వ శర్మ తన అఫిడవిట్లో చేర్చలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

కాగా, జలుక్బారి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన హిమంత ఎన్నికల అఫిడవిట్లో మొత్తం కుటుంబ ఆస్తులు సుమారు రూ. 35.16 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరు మీద రూ.2.36 కోట్లు చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. భార్య రింకి భుయాన్ శర్మ పేరుపై రూ.13.54 కోట్లు చరాస్తులు, రూ. 19.25 కోట్లు స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్ ద్వారా సమర్పించారు. అయితే, దుబాయ్ లో రింకు భుయాన్ శర్మకు ఉన్న ఆస్తులను వివరాలను అఫిడవిట్ ఎక్కడా ప్రస్తావించలేదని కాంగ్రెస్ నేతలు గతంలోనే ఆరోపించారు.

ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ పబ్లిసిటీ డిపార్డ్ మెంట్ చైర్మన్ పవన్ ఖేరా దుబాయ్ లో హిమంత బిశ్వ శర్మకు ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను మీడియా ఎదుట వెల్లడించారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోటీ చేసే అభ్యర్థి తర భార్య లేదా భర్తతో పాటు కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తుల వివరాను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనాల్సి ఉంటుంది. ఈ నియమాన్ని హిమంత ఉల్లంఘించారని, ఎందుకు దాచిపెట్టారోనని నిలదీశారు. ఈ ఆరోపణలు అస్సాం (Assam) రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. కొద్ది రోజుల్లోనే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ ఆరోపణలు బీజేపీకి నెగెటివ్ చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Also: ‘సర్’పైనే అన్ని పార్టీల ఫోకస్.. ఏజెంట్ల నియామకంలో బిజీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>