కెప్టెన్సీలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఫాలో అవుతానంటున్నాడు శుభ్‌మన్ గిల్(Shubman Gill). రోహిత్ నుంచి చాలా నేర్చుకున్నానని, వాటిని ఉపయోగించుకుంటానని అన్నాడు. తనకు వన్డే కెప్టెన్సీ రావడంపై గిల్.. గురువారం స్పందించాడు. ఒక కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma).. డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించాడని, తాను కూడా దానిని కొనసాగిస్తానని చెప్పాడు. ‘‘రోహిత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. కెప్టెన్‌గా జట్టులో నెలకొల్పిన ఫ్రెండ్లీ నేచర్‌ను నేను కూడా కంటిన్యూ చేస్తా. బయట నుంచి రకరకాల మాటలు అనేవాళ్లు చాలా మంది ఉంటారు. అవి నేను పట్టించుకోను. రోహిత్, విరాట్(Virat) ఇద్దరూ కూడా ప్రస్తుతం వన్డేల్లో ఆడుతున్నారు. వారిద్దరి భవితవ్యం ఏంటి? అనేది చాలా మంది ఊహాగానాలు వినిపిస్తున్నారు. వాళ్లు టీమిండియాను ఎన్నో మ్యాచ్‌లలో విజేతగా నిలబెట్టారు. వారి టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది. జట్టుకు వాళ్ల అవసరం చాలా ఉంది. వచ్చే వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా వాళ్లు రెడీ అవుతున్నారు’’ అని వివరించారు.
‘‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలీదు. ఎవరూ చెప్పలేరు కూడా. రానున్న వన్డే సిరీస్ విషయంలో అయితే అందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం.. నాతో సహా. నేనుప్పుడూ కూడా వర్తమానంలో ఉండటానికి ఇష్టపడతా. ప్రతిమ్యాచ్‌లో కూడా గెలవాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతాం. రాబోయే కొన్ని నెలలు మాకు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లలో రోహిత్, కోహ్లీ లాంటి ప్లేయర్ల అనుభవం మాకు కావాలి’’ అని గిల్(Shubman Gill) చెప్పుకొచ్చాడు.
Read Also: రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్ కోసమే ఎదురుచూపులు: అశ్విన్

