ప్రకాశం(Prakasam) జిల్లా సింగరాయకొండ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పొగాకు పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మొదలైన మంటలు నిమిషాల వ్యవధిలోనే పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. స్థానికుల నుంచి అగ్నిప్రమాద సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అతికష్టంపైన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పరిశ్రమలో పొగాకు(Tobacco Factory) ఉన్న కారణంగా మంటలను అదుపు చేయడం పెద్ద ఛాలెంజ్‌లా మాదింది.
Prakasam | గూడౌన్ బీకేటీ సంస్థది కాగా దానిని జీపీఐ సంస్థ అద్దెకు తీసుకుని అందులో పరిశ్రమను నడుపుతోంది. ఈ ప్రమాదంలో చుట్టుపక్కల ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.500 కోట్ల నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. సమాచారం అందిన వెంటనే ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాస రావు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదం ఎందుకు జరిగింది? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఇది ప్రమాదమా? లేదా ఎవరైనా కావాలని చేసిందా? ఇందులో ఏమైనా కుట్ర ఉందా? అన్న కోణాల్లో కూడా దర్యాప్తు చేయనున్నట్లు వివరించారు.
Read Also: రోహిత్ ఫార్ములాను నేను పాటిస్తా: గిల్

