కలం, స్పోర్ట్స్ : భారత టీ20 జట్టుకు తదుపరి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సరైన వ్యక్తని మాజీ జాతీయ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు జట్టును ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ శనివారం ముంబైలో సమావేశం కానుంది. ఈ తరుణంలో ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగిస్తారా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
సూర్యకుమార్ (Suryakumar Yadav) నాయకత్వంలో భారత్ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను గెలిచినప్పటికీ, ఆయన బ్యాటింగ్ ఫామ్ ఆందోళనకరంగా మారింది. ఐపీఎల్ 2026లో 13 ఇన్నింగ్స్‌లలో కేవలం 270 పరుగులు మాత్రమే చేసిన సూర్యకుమార్‌కు ఈ సెప్టెంబర్‌లో 36 ఏళ్లు నిండుతాయి. రాబోయే ఒలింపిక్స్, 2028 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు దీర్ఘకాలిక ప్రణాళికలతో కొత్త నాయకుడిని వెతకాల్సిన సమయం వచ్చిందని దేవాంగ్ గాంధీ శుక్రవారం పేర్కొన్నారు.
ఈ రేసులో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అందరికంటే ముందున్నాడని గాంధీ స్పష్టం చేశారు. అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ 2024 ఐపీఎల్ గెలవడమే కాకుండా, ఢిల్లీ (2020), పంజాబ్ (2025) జట్లు ఐపీఎల్ ఫైనల్స్ చేరాయి. ఆయన ముంబై జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా అందించారు. అంతర్జాతీయ అనుభవంతో పాటు ఐపీఎల్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న అయ్యర్‌కు కెప్టెన్సీ దక్కడం ఖాయమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇక వైస్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ వైపు దేవాంగ్ గాంధీ మొగ్గు చూపారు.
Read Also: బైకర్లకు ఎయిర్ బ్యాగ్.. కరీంనగర్ విద్యార్థికి జాతీయ గుర్తింపు
Follow Us On: Instagram

