Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ఎన్నికలకు డీజీపీ ఆదేశం

కలం, క్రైమ్ బ్యూరో : తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అసోసియేషన్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారంలో అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం డీజీపీని (DGP CV Anand) కలిసి వినతిపత్రం అందజేసింది. పలు పరిపాలనా, సాంకేతిక కారణాలతో ఎన్నికలు వాయిదా పడిన విషయాన్ని వారు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని పరిశీలించిన ఆయన, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

Read Also: బైకర్లకు ఎయిర్ బ్యాగ్.. కరీంనగర్ విద్యార్థికి జాతీయ గుర్తింపు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>