Mobile Popup Ad
Mobile Popup Ad

సర్కార్ బడికే పిల్లలు.. గ్రామస్తుల వినూత్న తీర్మానం

కలం, చండూరు: నల్లగొండ జిల్లాలోని చండూరు మండల పరిధిలోని నేర్మట (Nermata) గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ పాఠశాలకే (Government Schools) విద్యార్థులను పంపించాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎవరైనా గ్రామసభ నిర్ణయాన్ని ఉల్లంఘించి ప్రైవేట్ పాఠశాలలకు పంపితే సంబంధిత కుటుంబాలపై కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు.

ప్రైవేట్ పాఠశాలల వాహనాలు గ్రామంలోకి అనుమతించకూడదని గ్రామస్తులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల మునుగడ ప్రశ్నార్ధకంగా మారుతున్న సమయంలో నేర్మట గ్రామంలో విద్యా వ్యవస్థకు ఒక దిక్సూచి లాగా మారింది. విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా గ్రామస్తులు, పాలకవర్గం ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. తాను స్వయంగా ఒక ప్రైవేట్ టీచర్ ను నియమిస్తానని ఇచ్చిన హామీని గ్రామ ఉప సర్పంచ్ నిలబెట్టుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

మౌలిక వసతులు కల్పిస్తే..

చండూరు (Chandur) మండల పరిధిలోని నేర్మట (Nermata) ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడంతో కొంత నిరాశ కలిగించినప్పటికీ ఇప్పుడిప్పుడే కొత్త అడ్మిషన్లు ప్రారంభం కావడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. ప్రజలు, విద్యార్థులు ఇప్పుడిప్పుడే ప్రభుత్వ విద్యపై ఆసక్తి కనబరుస్తున్న సమయంలో విద్యాశాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రామంలో గ్రామ సర్పంచ్ తో సహా వార్డు మెంబర్లు, అధికారులు, గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలకే పిల్లలను పంపిస్తామని తీసుకున్న నిర్ణయానికి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ గ్రామంలో మొత్తం నలుగురు టీచర్లు ఉండగా, ఒక టీచర్ మాత్రం ఇక్కడ జీతం తీసుకుంటూ, వేరొక పాఠశాలకు వెళ్తున్నట్లు సమాచారం.

ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పాఠశాలకు హిందీ టీచర్ ను నియమించాలి. హిందీ టీచర్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించి, ఈ ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి నేర్మట గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారపాక వసంత ధనయ్య, ఉపసర్పంచ్ నందికొండ మమతవెంకట రమణారెడ్డి, పంచాయతీసెక్రటరి వెంకన్న, వార్డు మెంబర్లు నారపాక దశరథ, ఓర్సు రోహిణి, దోమలపల్లి బిక్షమయ్య, బుర్కాల రాజ్ కుమార్, బల్లెం కవిత, బురకల వసంత, బండమీది వెంకటయ్య, జెర్రిపోతుల ధనంజయ, ఈరటి సైదులు, గ్రామస్తులు,కట్ట శివ, ఎల్లయ్య, కృష్ణయ్య, బండమీది వెంకన్న, ఆంజనేయులు, దాసరి రవి, ప్రధానోపాధ్యాయులు మధుమోహన్ సార్,ఉపాధ్యాయులు శ్రీను, సుధాకర్, నాగలక్ష్మి, ఏఎన్ఎం సుజాత, ఆశాలు నాగమణి, పరమేశ్వరి, అంగన్వాడి టీచర్లు శివలీల, సుమలత, ఫీల్డ్ అసిస్టెంట్ కిరణ్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: పొర్లుదండాలు పెట్టినా బీఆర్ఎస్ పాపాలు పోవు: రేవంత్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>