Mobile Popup Ad
Mobile Popup Ad

యావన్ హత్య కేసు: బయటపడ్డ ఆడియో కాల్ రికార్డింగ్‌..!

కలం, వెబ్‌ డెస్క్‌ : సికింద్రాబాద్‌లో బీటెక్ విద్యార్థి యావన్ దారుణ హత్య కేసు (Yavan Murder Case)లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న రాత్రి ఆరుగురు దుండగులు అతడిని విచక్షణారహితంగా నరికి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా యావన్, సదరు యువతి మధ్య జరిగిన చివరి ఫోన్ కాల్ రికార్డింగ్ బయటకు రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తన కుటుంబ సభ్యులు యావన్‌పై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారని యువతి ఆ ఆడియోలో ముందే హెచ్చరించడం గమనార్హం.

‘నువ్వు నన్ను వేధిస్తున్నావని పోలీసులకు చెప్పాలని మావాళ్లు నన్ను ఒత్తిడి చేస్తున్నారు.. నీ మీదకు మావాళ్లు వస్తున్నారు.. ఇదంతా మా బావ వేసిన ప్లాన్’ అంటూ యువతి ఆవేదన వ్యక్తం చేయడం ఆ రికార్డింగ్‌లో వినిపిస్తోంది. అంతేకాకుండా పేపర్‌ లో ఏదో రాసిస్తారని, దానిపై తనతో బలవంతంగా సంతకం చేయించుకోవాలని చూస్తున్నారని ఆమె యావన్‌కు వివరించింది. ఈ ఆడియో బయటకు రావడంతో హత్య (Yavan Murder Case) వెనుక ఉన్న కుట్ర కోణం స్పష్టంగా కనిపిస్తోంది. పక్కా ప్రణాళికతోనే యువతి బంధువులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరల్ ఆడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Read Also: పోలీసుశాఖలో బదిలీల లొల్లి

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>