కలం, వెబ్ డెస్క్: తెలంగాణ హైకోర్టు శివధర్‌రెడ్డి డీజీపీ(DGP Shivdhar Reddy) నియామకంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. డీజీపీ పోస్టుకు అర్హులైన ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లతో రెండువారాల వ్యవధిలో లిస్టును పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపాలని ప్రభుత్వాన్నికి తెలిపింది. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఉండాలని.. ఆ తర్వాత కౌంటర్ అఫిడవిట్ ను కూడా దాఖలు చేయాలని సూచించింది. ఈ మేరకు తదుపరి విచారణను జనవరి 20కు వాయిదా వేసింది. కాగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ధనగోపాల్ రావు హైకోర్టులో తన పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు శివధర్ రెడ్డి నియామకం జరగలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలను ఇవ్వడం అనేది ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కు విరుద్దమన్నారు.
తాత్కాలిక ప్రాతిపదికన డీజీపీగా నియమించవద్దని సుప్రీంకోర్టు తన గైడ్ లైన్స్ లో పేర్కొన్నది. ఖాళీగా ఉన్న డీజీపీ(DGP Shivdhar Reddy) పోస్టును భర్తీ చేయడానికి మూడు నెలల ముందే యూపీఎస్సీకి ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను పంపించాలన్న నిబంధనను గుర్తుచేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం దాన్ని విస్మరించిందని మండిపడింది. డీజీపీగా నియమించే ముందు ఎంప్యానెల్‌మెంట్ కమిటీ సమావేశం కావాల్సి ఉన్నా శివధర్‌రెడ్డి నియామకం విషయంలో అది ఎందుకూ జరగలేదని ప్రశ్నించింది. ఐదు రోజుల క్రితం జరిగిన విచారణలో ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టును కోరారు. ఈ మేరకు ఇవాళ్ల పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. శివధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయలేదని, రెండు వారాల గడువులో యూపీఎస్సీకి ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లతో కూడిన లిస్టును పంపి దానికి అనుగుణంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
Read Also: ’కడియం వెల్‌కమ్‘.. బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
Follow Us On: Instagram


