కలం, వరంగల్ బ్యూరో: ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)ని బీఆర్ఎస్ శ్రేణులు టార్గెట్ చేస్తున్నాయి. కడియం ఎక్కడికి వెళ్లినా ఆ పార్టీ కార్యకర్తలు వెంటాడుతున్నారు. ఇక కడియం సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. బుధవారం మరోసారి కడియం శ్రీహరికి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి నిరసన ఎదురైంది. కడియం శ్రీహరికి స్వాగతం, సుస్వాగతం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు.
బుధవారం జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్దకు కడియం చేరుకోగానే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ప్ల కార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. స్థానిక పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు.
విషయం తెలుసుకున్న స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్ శర్మ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. కడియం శ్రీహరికి (Kadiyam Srihari) ‘స్వాగతం, సుస్వాగతం‘ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలపడం చర్చకు దారి తీసింది. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ మాజీ ఎంపీపీ వై కుమార్ గౌడ్ నాయకత్వంలో ఈ ఆందోళన సాగింది. ఈ ఆందోళనల్లో విజయ్గూడ కిరణ్ కుమార్, కుర్ర రాజేందర్ నాయక్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: సర్పంచ్‌లకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
Follow Us On : WhatsApp


