శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి: కేరళలో ఉద్రిక్తత !

కలం, వెబ్ డెస్క్ : కేరళలోని మలప్పురం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. వండూర్ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా, బైక్‌లపై వచ్చిన కొందరు ఆందోళనకారులు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో దాడిని నిలువరించేందుకు ప్రయత్నించిన శశిథరూర్ గన్‌మెన్‌తో పాటు డ్రైవర్‌పై కూడా దుండగులు దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై స్పందించిన వాండూర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దాడికి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితురాలిపై పోలీసులు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ప్రచారం తుది దశకు చేరుకున్న తరుణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>