Mobile Popup Ad
Mobile Popup Ad

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లోని నాసిక్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు బావిలో పడి 9 మంది మృతి చెందారు. ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహించిన సోషల్ ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో జరిగింది. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. వీరంతా ఓ విందు కార్యక్రమం కోసం వెళ్లి వస్తుండగా ప్రమాదం సంభవించింది. నాసిక్​ సమీపంలో కారు బావిలో పడడంతో ఒకే కుటుంబానికి చెంది ఆరుగురు పిల్లలతో సహా 9 మంది దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులందరూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మృతుల్లో 34 ఏళ్ల సునీల్ దత్తాత్రేయ దర్గోడే, ఆయన భార్య 30 ఏళ్ల రేష్మ, వారి కుమార్తె 10 ఏళ్ల రాఖీ (అలియాస్ గుణవంతి), మేనకోడళ్లు 13 ఏళ్ల మాధురి, 11 ఏళ్ల శ్రేయష్, కుమార్తె 14 ఏళ్ల సృష్టి,11 ఏళ్ల శ్రావణి, 7 ఏళ్ల సమృద్ధి ఉన్నారు.

Read Also: శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి: కేరళలో ఉద్రిక్తత !

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>