Mobile Popup Ad
Mobile Popup Ad

శంషాబాద్ ORR ప్రమాదం.. మృతులు సిరిసిల్ల వాసులు

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ (Shamshabad ORR Crash) లో మృతి చెందిన వారి వివరాలను పోలీసులు గుర్తించారు. మృతులు సిరిసిల్ల జిల్లాకు చెందిన వారిగా పోలీసుల విచారణలో తేలింది. సిరిసిల్ల బీఆర్ఎస్ నేతల బొల్లి రాంమోహన్ కుటంబ సభ్యులుగా గుర్తించారు. అయితే, వారు సనత్ నగర్ ప్రాంతంలో గత కొంతకాలంగా ఉంటున్నారు. మృతులు శ్రీనివాస్, శివ, కృష్ణచంద్ర, మాధవ్, రిషిక.. మరొకరి పేరు తెలియాల్సి ఉంది.

శుక్రవారం ఉదయం యాదాద్రి నుంచి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్నలారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. లారీ వెనుక భాగంలో చిక్కుకున్న కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. కాగా, బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ద్వారా పరామర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>