కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆమలు చేయాలని, లేదంటే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ (MP Laxman) హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో ఆయన పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలకు సంఘీభావం ప్రకటించారు. ఈ ధర్నాలో ఎంపీ లక్ష్మణ్ తో పాటు ఎమ్మెల్యే ఏలేటి, పలువురు బీజేపీ ఎమ్మెల్సీలు పాల్గొని వారి సంఘీభావాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కె. లక్ష్మణ్ (MP Laxman) మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానం (OPS) ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకారం 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కల్పించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని తెలిపారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి, విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read : యువతకు అజిత్ దోవల్ కీలక సూచన
Follow Us On : WhatsApp

