మోదీ ఇంటిని ముట్టడిస్తాం.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన

కలం, వెబ్​ డెస్క్​ : నీట్​ పరీక్ష లీక్​ వ్యవహారంలో ప్రధాని మోదీ (PM Modi) ఇంటి వద్ద కాంగ్రెస్​ చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్ (Arvind Kejriwal)​ కూడా ప్రధాని ఇంటి ముట్టడికి పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. శనివారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ20 ఇంధనంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ20 పెట్రోల్​ ను ప్రజలపై బలవంతంగా రుద్దొద్దు అని కోరారు. పౌరులకు పెట్రోల్, ఈ20లలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై వినతిపత్రాలు సమర్పించేందుకు ఆగస్టు 4న ప్రధానమంత్రి నివాసం వరకు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.

పెట్రోల్​ వినియోగంపై వినతిపత్రాలు సేకరించి, సుమారు 100 మందితో కలిసి లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని నరేంద్ర మోదీ నివాసం వరకు పాదయాత్రకు నాయకత్వం వహిస్తానని వెల్లడించారు. పెట్రోల్ స్టేషన్లలో ఈ20, సాధారణ పెట్రోల్‌లలో ఏదైనా ఎంచుకునేందుకు వినియోగదారులను అనుమతించాలన్నారు. ఈ20 మిశ్రమ పెట్రోల్ ధరలతో పాటు సాధారణ ధరలను కూడా తగ్గించాలని కేజ్రీవాల్ (Arvind Kejriwal) డిమాండ్ చేశారు.

Also Read : అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>