కలం, వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు (AP Local Body Elections) కసరత్తు మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, అధికారులు ఎన్నికల దిశగా ముందుకు సాగుతున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల పార్టీ నేతలు స్థానిక ఎన్నికలకు సన్నద్దం కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 6న మున్సిపల్ , పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సీఎస్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వార్డుల విభజన, ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ లో ప్రారంభించి నవంబర్ లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలతో ప్రారంభించి, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, చివరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ప్రచారం కూడా ప్రారంభించారు.

