సివిల్ ఇంజనీర్లకు భవిష్యత్తులో భారీ డిమాండ్: గంగుల కమలాకర్

కలం, కరీంనగర్ బ్యూరో: అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, నాణ్యతతో, తక్కువ ఖర్చుతో కూడిన ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (ACCEI) కరీంనగర్ (Karimnagar) సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘బిల్డ్ ఎక్స్‌పో’ (Build Expo) 6వ ఎడిషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కరీంనగర్ ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంందని కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ కూడా అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.

ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాపిడ్ ఫోర్స్ తరహాలో విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఒక సివిల్ ఇంజనీర్‌నేనని గుర్తుచేసుకుంటూ.. కరీంనగర్‌లో ‘శ్వేతా హోటల్’ నిర్మించే సమయంలో నగరంలో హోటల్ నడవదని ఎంతోమంది అన్నారని, కానీ నేడు ఆ హోటల్‌లో రూములు దొరకని పరిస్థితి ఉందంటూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తుల బాలయ్య, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>