కలం, వెబ్ డెస్క్: లైంగిక వేధింపుల కేసులో మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys) డైరెక్టర్ చిదంబరం ఎస్ పొడువాల్పై కేసు నమోదు అయింది. తన ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించడమే కాకుండా, లైంగిక దాడికి యత్నించాడంటూ ఆయనపై ఓ నటి కేసు పెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నటి, చిదంబరం 2022లో ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్లు. ఆ క్రమంలో ఒకరోజు నటి ఇంట్లోకి ప్రవేశించిన చిదంబరం, ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. దీనిపై ఆమె ఆదివారం ఎర్నాకుళం పోలీస్ స్టేషన్ కేసు పెట్టింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు భారత న్యాయ సంహిత ప్రకారం అత్యాచారయత్నం, లైంగిక వేధింపుల కేసు పెట్టారు. విచారణ అనంతరం చిదంబరంను ఏ క్షణంలో అయినా అరెస్ట్ అవకాశముంది.
కాగా, నిజజీవిత సంఘటనల ఆధారంగా 2024లో వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్(Manjummel Boys) సినిమా మలయాళంలో రికార్డు విజయాన్ని అందుకుంది. అడవుల్లో పర్యటనకు వెళ్లిన ఓ బృందంలోని సభ్యుడు అక్కడ 800 అడుగుల లోతులోని లోయలోకి పడిపోతాడు. అతడిని రక్షించే ప్రయత్నంపై తీసిన సినిమానే మంజుమ్మెల్ బాయ్స్. చిదంబరం(Chidambaram S. Poduval) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు కూడా రాబట్టింది.
Read Also: హోళీలో ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు.. ఎస్పీ వార్నింగ్
Follow Us On: Instagram

