వరంగల్ నిట్ క్యాంపస్‌లో మద్యం కలకలం..?

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ నిట్ క్యాంపస్ లో (Warangal NIT) ఫుడ్ పాయిజన్ ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిట్ లో (Warangal NIT) మూడురోజుల పాటు స్ప్రింగ్ స్ప్రీ పేరుతో వేడుకలు జరిగాయి. చివరి రోజు ఆహారం తీసుకున్నాక 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర్యయారు. అయితే పలువురు విద్యార్థులు మద్యం సేవించి… అనంతరం అధికంగా షెవర్మ తిన్నట్టు తెలిసింది. విద్యార్థులు మద్యం సేవించినప్పుడు గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మద్యం సీసాలను అక్కడి నుంచి తొలగించిన దృశ్యాలు వెలుగుచూశాయి.

అయితే ఈ తతంగంమంతా బయటకు పొక్కకుండా నిట్ అధికారులు గోప్యతను పాటించడం విమర్శలకు తావిస్తోంది. అస్వస్థులైన విద్యార్థులను గుట్టుచప్పుడు కాకుండా హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు కోలుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ప్రతిష్టాత్మక నిట్ లోకి మద్యం బాటిల్స్ రావడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Read Also: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్ అంకిత్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>