ముదిగొండలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా ముదిగొండ మండలంలో అక్రమ ఇసుక రవాణా (Sand Smuggling) పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఐ మురళీ ఆదేశాల మేరకు ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున ప్రత్యేక దాడులు నిర్వహించి, అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నారు.

పెద్దమండవ, గందసిరి మున్నేరు వాగుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారంతో పోలీసులు కమలాపురం, చిరుమర్రి, న్యూ లక్ష్మీపురం గ్రామాల సమీపంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని ముదిగొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సంబంధిత యజమానులు, డ్రైవర్లపై చట్టపరమైన కేసులు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు.

​ఈ సందర్భంగా సీఐ మురళీ మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా (Sand Smuggling), సహజ వనరుల దోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతుంటే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ అబ్దుల్ ఖలిక్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, కృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: ‘ఛలో మణుగూరు’కు బ్రేక్.. అరెస్టులతో వేడెక్కిన రాజకీయం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>