కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో భానుడు కర్ఫ్యూ విధించినట్టే తయారైంది పరిస్థితి. రోడ్లపై జనాలు కనిపించడం లేదు. బయట తిరగాలంటే జనాలు జంకుతున్నారు. కారణం భానుడు నిప్పులు (Heatwave) కురిపిస్తున్నాడు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో కనిపించింది. సగటున 43 నుంచి 45. 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజల భీమ్గల్లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సిరికొండ, వర్ని, నవీపేట్, చందూర్, రుద్రూర్ మండలాల్లో 41.1 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మిగిలిన మండలాల్లో 44.3 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవడం చెప్పుకోదగ్గ విషయం. అయితే ఉదయం 9 అవుతూంటేనే సూరీడు మండి పోతున్నాడు.. బయటకు వెళ్తే చాలు చెమటతో బట్టలు కూడా తడిసి పోతున్నాయి. ఎండ వేడిమికి చర్మం కూడా మండే పరిస్థితులు నెలకొన్నాయి.
ఆసుపత్రులకు వెళ్లేవారు ఇతర అత్యవసర శుభకార్యాలు అశుభకార్యాలకు వెళ్లాల్సి వచ్చేవారు మాత్రమే ధైర్యం చేసి బయటకు వెళ్తున్నారు. ఇక ఉద్యోగాలకు బయట తిరిగేవారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు తప్పని పరిస్థితిలో ఎండలో తిరుగుతున్నారు. ఇక పోలీసులు డాక్టర్లు ఆస్పత్రి సిబ్బంది ఎమర్జెన్సీ విభాగంలో ఉండే వారికి ఉద్యోగులకు ఎలాగూ తప్పదు. కానీ ఎల్ నినో ప్రభావంతో వేడి గాలులు వీస్తున్నాయి. వాతావరణం రాత్రి 8 – 9 అవుతుంటే కూడా చల్లబడటం లేదు. వ్యాపారాలు చేసుకునే వారు అయితే రెండు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు సాగక ఒకవైపు ఎండతో మరోవైపు ఇక్కట్లు పడుతున్నారు. ఇక రోజువారి కూలి పనులు చేసుకునే వారు చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు పనులు లేక నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజామాబాద్ జిల్లా దక్కన్ పీఠభూమిలో ఉండడం వల్ల సముద్ర మట్టానికి ఎత్తున ఉండటం అది కూడా సముద్రానికి దూర ప్రాంతం కావడం వల్ల నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి.
ఎండ దెబ్బ / వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తప్పనిసరి – డాక్టర్ భరత్ పవార్
వేసవిలో 40°C దాటితే హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ముఖ్యంగా పిల్లలు, ముసలివాళ్లకు రిస్క్ ఎక్కువ..
1.టైమింగ్ : ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలోకి వెళ్లకూడదు.. చాలా అవసరం అయితేనే వెళ్లాలి.
2.బట్టలు : తెల్లని, లేత రంగు కాటన్ డ్రెస్ వేసుకోవాలి. టైట్ బట్టలు వేసుకోవద్దు. ఫుల్ హ్యాండ్స్ షర్ట్ బెటర్.
3.తల కవర్ : టోపీ, గొడుగు, తలపాగా తప్పనిసరి. తలకు డైరెక్ట్ ఎండ తగలకూడదు.
4.కళ్ళజోడు : UV ప్రొటెక్షన్ ఉన్న సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి
5.సన్‌స్క్రీన్ : SPF 30+ ఉన్న క్రీమ్ ముఖం, చేతులకు రాసుకోవాలి
6.దాహం వేయకపోయినా *గంటకు 1 గ్లాసు నీళ్లు తాగాలి. రోజుకు 3-4 లీటర్లకు మించి నీళ్ళు తీసుకోవాలి
7.మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్ వాటర్, ORS. ఉప్పు-పంచదార నీళ్లు తీసుకుంటుండాలి.
8 పుచ్చకాయ, కర్బూజ, కీరదోస, నారింజ, మజ్జిగ అన్నం. ఇవి బాడీని కూల్ చేస్తాయి.
9.ఆల్కహాల్, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ తాగొద్దు. ఇవి బాడీలో నీళ్లు తగ్గిస్తాయి.
10.ఆయిల్ ఫుడ్, మసాలా, నాన్-వెజ్ తగ్గించి లైట్‌గా తినాలి
11.ఇల్లు చల్లగా కిటికీలకు తడి బట్టలు కట్టాలి. మధ్యాహ్నం కర్టెన్స్ వేయాలి
12.రోజుకు 2 సార్లు చన్నీటి స్నానం చేయాలి
13.ఎండ దెబ్బ లక్షణాల్లో విపరీతమైన తలనొప్పి, వాంతులు, తల తిరగడం, చమట పట్టకపోవడం, 104°F జ్వరం, ఫిట్స్.. లాంటివి కనిపిస్తే వెంటనే నీడలోకి/AC రూమ్‌లోకి ఫ్యాన్ దగ్గరికి తీసుకెళ్లాలి. తడి గుడ్డతో ఒళ్లంతా తుడువాలి.
14.స్పృహ ఉంటే ORS, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగించాలి. స్పృహ లేకపోతే ఏమీ తాగించొద్దు.
15.108కి కాల్ లేదా వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. ఇది మెడికల్ ఎమర్జెన్సీ..
16.”నేను గట్టిగా ఉన్నాను, నాకేం కాదు” అని ఎండలో తిరగొద్దు. Heat Stroke వస్తే 30 నిమిషాల్లో ప్రాణం పోతుంది.. ఎండతో గేమ్స్ వద్దు.. జాగ్రత్త అవసరం.
Read Also: విదేశీయుల ఓట్లు తొలగిస్తే రాహుల్ గాంధీకి ఏం నొప్పి?: కిషన్ రెడ్డి
Follow Us On: Instagram

