కలం, వెబ్ డెస్క్: గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురేంద్రనగర్ జిల్లాలోని లఖ్తర్-విరామగామ్ హైవేపై జరిగిన ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లఖ్తర్ హైవేపై దేదాద్ర గ్రామం సమీపంలో ఓ కారు, ఎస్‌యూవీ ఒకదానికొకటి ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కారులో భయంకరంగా మంటలు (car crash fire) చెలరేగాయి. మంటలు క్షణాల్లో కారు మొత్తాన్ని చుట్టేయడంతో లోపల ఉన్న ప్రయాణికులకు బయటకు వచ్చే అవకాశం లేకుండాపోయింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు ప్రాణాలతో ఉండగానే మంటల్లోనే కాలిపోయి చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

