Mobile Popup Ad
Mobile Popup Ad

లక్నోకి సమస్య పూరన్.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: లక్నో సూపర్ జాయింట్స్‌కు అతిపెద్ద ఆందోళనగా మారింది ఆ జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పూరన్ వల్ల లక్నోకు రవ్వంత కూడా లాభం లేదని అన్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ ఫామ్ అత్యంత పేలవంగా ఉంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తయిన నేపథ్యంలో, వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ప్రదర్శనపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పూరన్ ఫామ్, మైదానంలో అతని బాడీ లాంగ్వేజ్ లక్నో జట్టుకు పెద్ద ఆందోళనకరంగా మారాయని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పూరన్ 21 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అతని సగటు కేవలం 10.25 మాత్రమే ఉండటం గమనార్హం.

దీనిపై అశ్విన్ స్పందిస్తూ, లక్నో యాజమాన్యం పూరన్‌ను రూ.21 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుందని, దానికి తగిన ఫలితాన్ని అతను జట్టుకు అందించాలని పేర్కొన్నారు. పూరన్ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అశ్విన్, అతనికి కాస్త విశ్రాంతి ఇచ్చి జోష్ ఇంగ్లిస్ లేదా మాథ్యూ బ్రీట్జ్కే వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని సూచించారు. రిషబ్ పంత్ గురించి కూడా అశ్విన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పంత్ ఇప్పుడు మునుపటిలా సిక్సర్లు కొట్టడం లేదని, అందుకే పవర్ ప్లే సమయంలో ఫీల్డింగ్ పరిమితులను వాడుకోవడానికి అతన్ని ఓపెనర్‌గా పంపాలని అశ్విన్ సలహా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>