కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడుగురు సివిల్ ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతులు కల్పిస్తూ సీపీ గౌష్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సేవా నియమావళి ప్రకారం జోన్-3 రాజన్న పరిధిలో ఖరారు చేసిన సీనియారిటీ జాబితా ఆధారంగా ఈ పదోన్నతులు కల్పించారు. ప్రమోషన్ పొందిన వారిలోకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సై మొగురం సుధాకర్, కరీంనగర్-III టౌన్‌లో పని చేస్తున్న మురహరి యాదగిరి, చిగురుమామిడిలో పని చేస్తున్న వీర తిరుపతి, కరీంనగర్-I టౌన్‌లో పనిచేస్తున్న మహమ్మద్ నజీముద్దీన్, కరీంనగర్-III టౌన్‌లో పనిచేస్తున్న సయ్యద్ అబ్దుల్ రజాక్, గంగాధరలో పనిచేస్తున్న మొగిలి మల్లేశం, సిద్ధిపేటలో ఇంటెలిజెన్స్ ఏఎస్సై ఎండి.ఇర్షాద్, కేశవపట్నంలో పనిచేస్తున్న సయ్యద్ పాషాకు ఎస్సైలుగా పదోన్నతి దక్కింది. పదోన్నతి పొందిన వారిని పరిపాలనా అవసరాలకు అనుగుణంగా కరీంనగర్, సిద్ధిపేట కమిషనరేట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించారు. వీరంతా 15 రోజుల్లోగా తమకు కేటాయించిన కొత్త విధుల్లో హాజరుకావాలని సీపీ ఆదేశించారు. పదోన్నతులు కల్పించినందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు, ఎస్సై మామిడి సురేందర్ సీపీ గౌష్ ఆలంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

