కలం, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోవూరు (Kovur Bus Accident) మండలం పడుగుపాడు వద్ద రోడ్డు పనులు చేస్తున్న జేసీబీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నెల్లూరు టు కావాలి నాన్ స్టాప్ బస్సు అతివేగంతో జేసీబీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోగా.. స్థానికులు శ్రమించి డ్రైవర్ ను బయటకి తీశారు.
ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోవడంతో రోడ్డు వర్క్ చేస్తున్న జేసీబీని ఢీకొట్టిందని వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

