కలం, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌లో రైల్వే పోలీసులు భారీగా వాహలా డబ్బు ( Hawala Money)ను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి సికింద్రాబాద్ కు వచ్చిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నుంచి బొల్లారం, మల్కాజిగిరి రైల్వేస్టేషన్ లలో దిగిన విజయ అంబాదాస్ అనే వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన విజయ అంబాదాస్ వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్ ను తనిఖీ చేశారు.
ఇందులో భాగంగా అతని వద్ద నుంచి రూ. 1.22 కోట్ల హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో నగల దుకాణం నడుపుతున్న బంటీకి డబ్బులు ఇచ్చేందుకే తాను దేవగిరి ఎక్స్ ప్రెస్ లో హవాలా నగదు తరలించినట్లు పోలీసుల విచారణలో విజయ్ ఒప్పుకున్నాడు. దీంతో స్వాధీనం చేసుకున్న నగదుని తదుపరి విచారణ అనంతరం ఆదాయపు పన్ను శాఖకు పోలీసులు తరలించారు.

