కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ ప్రజల దాహర్తీని తీర్చే గండిపేట (Gandipet) చెరువు డేంజర్ జోన్‌లో పడింది. గతంలో కలుషిత జలాలు, వ్యర్థాలు చెరవులో కలవడంతో అనేక ఫిర్యాదులొచ్చాయి. ప్రస్తుతం గండిపేట చెరువులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను వదిలే వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వ్యర్థాలు వదులుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సెప్టిక్ ట్యాంకర్‌కు అక్రమంగా వాటర్ బోర్డు, GHMC లోగో పెట్టుకున్నారని నిర్ధారణ అయ్యింది.
మార్కెట్లో ప్యూరిఫైడ్ వాటర్ దొరుకుతున్నా.. అవి ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తూ చాలామంది నగరవాసులు జీహెచ్ఎంసీ వాటర్ మాత్రమే తాగుతున్నారు. హైదరాబాద్ (Hyderabad)లో అత్యధికంగా నల్లా నీరునే తాగుతున్నారు. గత కొన్ని రోజులుగా మంచినీరు రంగు మారడం, దుర్వాసన రావడం లాంటి సమస్యలను నగర ప్రజలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా వర్షకాల సమయంలోనే నీరు కలుషితమవుతుంది. కానీ ఇతర సీజన్లలో నీరు తరచుగా కలుషితం కావడం, విరేచనాల బారిన పడుతుండటంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ దాహార్తీని తీర్చు జలశయాలను శుభ్రంగా ఉంచాలని జనాలు కోరుతున్నారు.
హైదరాబాద్ నగరానికి పశ్చిమాన గండిపేట(Gandipet) ఉంది. 1920లో ముసీ నది మీద నిర్మించారు. 1908 ముసీ వరదల తర్వాత నగరాన్ని రక్షించడానికి ఈ చెరువు (Lake) కీలకంగా మారింది. నాటి నుంచి నేటి వరకు నగరానికి “లంగ్ స్పేస్”లా పని చేస్తుంది. ఇక్కడి దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటాయి. అందుకే నీటి కాలుష్యం నివారించడానికి పరిసరాల్లో నిర్మాణాలపై పరిమితులు ఉన్నాయి.
Read Also: సర్పంచ్ సాబ్‌లు.. ఈ ‘గంగదేవిపల్లి’ మోడల్ గురించి మీకు తెలుసా?
Follow Us On: X(Twitter)


