కలం వెబ్ డెస్క్ : ప్రసిద్ధ తిరుమల(Tirumala) కొండపై రాజకీయ నేతల బ్యానర్లు దర్శనమివ్వడం కలకలం రేపింది. తమిళనాడు(Tamil Nadu)కు చెందిన పలువురు అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆలయ పరిసరాల్లో రాజకీయ బ్యానర్ల(Political Banners)తో రీల్స్ చేశారు. ఈ బ్యానర్‌లో మాజీ సీఎంలు జయలలిత, పళని స్వామి చిత్రాలున్నాయి. ఈ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తిరుమల(Tirumala) కొండపై రాజకీయ కార్యకలాలపై నిషేధం ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ(TTD) అధికారులు స్పందిస్తూ రాజకీయ బ్యానర్లతో వీడియోలు తీసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: శ్రీశైలం క్షేత్రంలో యువతి రీల్స్.. భక్తుల ఆగ్రహం
Follow Us On: Youtube


