Mobile Popup Ad
Mobile Popup Ad

సదాశివపేటలో రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

కలం, వెబ్​ డెస్క్​ : సంగారెడ్డి జిల్లా సదాశివపేట (Sadashivpet) పట్టణ శివారులో జాతీయ రహదారి 65పై శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకున్నది. రహదారి మలుపు వద్ద వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

బస్సు ముందు భాగం నలిగిపోవడంతో, ప్రయాణికులు డ్రైవర్ క్యాబిన్ ద్వారా కిందకు దిగారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: పాక్ కెప్టెన్సీపై అఫ్రిదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>