కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన ర‌ష్మిక మంద‌న్నా!

క‌లం, వెబ్ డెస్క్‌: Rashmika New Record | కొత్త పెళ్లి కూతురు ర‌ష్మిక మంద‌న్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ త‌రం యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఎవ‌రైనా ర‌ష్మిక త‌ర్వాతే.. అందుకే ర‌ష్మిక నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరు తెచ్చుకుంది. ఇక ఇటీవ‌ల త‌న చిర‌కాల ప్రియుడు, స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda)ను ర‌ష్మిక పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఉద‌య్‌పూర్‌లో జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌ను అత్యంత స‌న్నిహితులు, కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య చాలా గ్రాండ్‌గా చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోల విష‌యం సోష‌ల్ మీడియాలో సునామీ సృష్టించాయి.

రెండు రోజుల నుంచి ఇప్ప‌టికీ ఎక్క‌డ చూసినా విరోశ్ ఫోటోలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. త‌మ పెళ్లి ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్న ఈ జంట కేవ‌లం త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ ఫోటోలే అంత‌టా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ పెళ్లి ఫోటోల పోస్టుతో ర‌ష్మిక కొత్త రికార్డు (Rashmika New Record) క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో అత్య‌ధిక లైక్స్ సంపాదించిన ఇండియ‌న్ సెల‌బ్రెటీ పోస్ట్‌గా ర‌ష్మిక పెళ్లి ఫోటోలు రికార్డుకెక్కాయి. గ‌తంలో ఈ రికార్డు క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఉండేది. విరాట్ ఖాతాలో 22.9 మిలియ‌న్ల లైక్స్‌తో రికార్డు ఉండేది. అయితే తాజాగా ర‌ష్మిక పెళ్లి ఫోటోలు ఏకంగా 24 మిలియ‌న్ల లైక్స్ దాటేశాయి. దీన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌ష్మిక ఫ్యాన్స్ సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. మ‌రోవైపు సెల‌బ్రెటీల పెళ్లి పోస్టుల్లో 20 మిలియ‌న్ల‌కు పైగా లైకులు సాధించిన ఏకైక జంట‌గా విజ‌య్, ర‌ష్మిక నిలిచారు. ర‌ష్మిక క్రేజ్ చూసి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు.

Read Also: యాక్షన్ ప్రియులకు పూనకాలే.. ఒక్క క్లైమాక్స్‌కే రూ.20 కోట్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>