కలం, వెబ్ డెస్క్ : ర్యాగింగ్ భూతం కాలేజీల నుంచి పాఠశాలలకు వ్యాపించింది. స్నేహ భావంతో ఉండాల్సిన సహచరుల మధ్య చిచ్చు పెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) మైనారిటీ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేశారు. తాము చెప్పిన పనులు చేయడం లేదంటూ ర్యాగింగ్ చేశారు. ఈ దాడిలో విద్యార్థి తలతో పాటు చేయికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: ప్రేమ ఒక్కసారేనా.. మళ్లీ మళ్లీ కలగదా?
Follow Us On: Facebook

