గుడ్ న్యూస్.. టెన్త్ స్టూడెంట్స్ కు అదనంగా 7 మార్కులు

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. SSC పరీక్షల్లో (SSC Exams) సందిగ్ధత ఉన్న ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల్లో సందిగ్ధ సమాధానాలపై తుది ఫలితాల్లో అడిషనల్ మార్కులు ఇవ్వాలని ప్రిన్సిపల్ వాల్యుయేషన్ సూచనలను డీఈవోలకు ఎస్ఎస్‌సీ బోర్డు అధికారులు పంపించారు. అయితే ప్రశ్నలు స్పష్టంగా లేని చోట వాటిని అటెంప్ట్ (Attempt) చేసిన విద్యార్థులకు మాత్రమే మార్కులు లభించనున్నాయి.

మొత్తంగా హిందీ సబ్జెక్టులో సందిగ్ధంగా ఉన్న ప్రశ్నల కారణంగా 2 మార్కులు, ఇంగ్లీష్ సబ్జెక్టులో తలెత్తిన లోపాల వల్ల ఏకంగా 5 మార్కులు అదనంగా కలపాలని బోర్డు నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. మొత్తంగా ఈ రెండు సబ్జెక్టుల ద్వారా విద్యార్థులకు 7 మార్కుల వరకు లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగి.. విద్యార్థులు మెరుగైన గ్రేడింగ్ సాధించే అవకాశం కలిగింది. అయితే మరో మూడు ప్రశ్నల్లో కూడా తప్పులు ఉన్నాయని, వాటికి కూడా మార్కులు కలపాలని కొందరు పెరెంట్స్ బోర్డును కోరారు. అయితే, దీనిపై బోర్డు వర్గాలు స్పందిస్తూ.. ఆ మూడు ప్రశ్నల్లో ఎలాంటి పొరపాట్లు లేవని స్పష్టం చేశాయి. విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని, సబ్జెక్టుపై ఉన్న పట్టును పరీక్షించేందుకు ప్రశ్నలను వివిధ కోణాల్లో అడగడం పరీక్షా విధానంలో భాగమేనని వివరించాయి.

Read Also: పర్యాటకంలో కొత్త ట్రెండ్.. నిద్ర కోసమే విహారయాత్రలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>