గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ బంద్‌కు (Gajwel Bandh) పిలుపునిచ్చింది. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడికి నిరసనగా బీఆర్ఎస్ సోమవారం గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి (Vanteru Prathap Reddy) శనివారం ఓ ప్రకటన చేశారు. క్యాంప్ ఆఫీసుపై దాడి ఘటన అనంతరం గజ్వేల్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న క్యాంపు ఆఫీసుకు భద్రత లేకపోతే సామాన్యులకు ఎలా భద్రత ఉంటుందని ప్రశ్నించారు.

దాడికి నిరసనగా బంద్

కాంగ్రెస్ దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్‌కు పిలుపునిస్తున్నామని.. శాంతియుతంగా బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు బంద్‌లో (Gajwel Bandh) పాల్గొని తమ నిరసన తెలపాలని కోరారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ క్యాంప్ ఆఫీసు మీద దాడి చేశారని ఆరోపింంచారు. శనివారం ఉదయం గజ్వేల్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌ను కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. అనంతరం కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను తగిలించారు.  ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. చివరకు బంద్‌కు పిలుపునిచ్చారు.

Read Also: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>