Mobile Popup Ad
Mobile Popup Ad

జనగామలో గంజాయి సేవిస్తున్న యువకుడి అరెస్ట్

కలం, జనగామ : జనగామ (Jangaon) పట్టణంలోని చీటకోడూరు రోడ్డులో గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక యువకుడిని అరెస్ట్ చేయగా, మరొకరు తప్పించుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ ఎస్ఐ భరత్ తన సిబ్బందితో కలిసి జనగామ జిల్లా కేంద్రంలోని చీటకోడూరు రోడ్డు పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవిస్తూ పోలీసులకు కనిపించారు. పోలీసులను చూడగానే వారు పారిపోయే ప్రయత్నం చేయగా, ఇట్టబోయిన రాకేష్ అనే యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. కాగా, రంజిత్ అనే మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అరెస్టయిన రాకేష్ వద్ద 60 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న రంజిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Read Also: జీవన్ రెడ్డిని చూసి జనం నవ్వుకుంటున్నారు: పీసీసీ చీఫ్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>