తెలంగాణ గురించి పిచ్చి కూతలు కూయొద్దు.. ఏపీ నేతలపై కేటీఆర్ ఫైర్

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు (TDP MP Sri Krishna Devarayalu) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబడుతూ, ఆ రోజును పార్లమెంట్ చరిత్రలో బ్లాక్ డేగా అభివర్ణించారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలని పక్కనపెట్టిందని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ వ్యతిరేకించినప్పటికీ మొండిగా విభజన బిల్లును ముందుకు తీసుకెళ్లిందని విమర్శించారు.

ప్రస్తుతం టీడీపీ ఎంపీ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘‘తెలంగాణ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉండే టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు.. మీ చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి గురించో, ఏదైనా మంచి పనులు గురించే మాట్లాడు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.

Read Also: వంట గ్యాస్ వినియోగదారులకు సజ్జనార్ కీలక సూచనలు

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>