కలం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో జార్ఖండ్ సర్కార్ (Jharkhand Govt)కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద టీడీపీఎల్ ఆధ్వర్యంలో జరిగిన జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ (JSSC-CGL) సహా అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంస్థ నిర్వహించిన పరీక్షలు, విడుదల చేసిన ఫలితాలు, ఎంపికైన అభ్యర్థుల ప్రక్రియ వంటి అన్నింటిని రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు.
అలాగే 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని పరీక్షలలోని అక్రమాలపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు. ఈ విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ఒక పరీక్షల సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు.

