రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు

కలం, నిర్మల్: జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ఉన్నటువంటి రైస్ మిల్లులపై (Sarangapur Rice Mills) విజిలెన్స్ అధికారులు సోమవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మండలంలోని స్వర్ణ గ్రామంలో ఉన్న లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లులోని సీఎంఆర్ బియ్యం నిల్వలు, స్టాక్ వివరాలు, రికార్డులు, మిల్లింగ్‌ కు సంబంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

రికార్డుల్లో నమోదైన వివరాలకు, మిల్లులో ఉన్న వాస్తవ నిల్వలకు మధ్య ఏమైనా తేడాలు పరిశీలించినట్లు సమాచారం. మిల్లుల్లో సీఎంఆర్ బియ్యం విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. తనిఖీల అనంతరం అధికారులు సేకరించిన వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అధికారుల ప్రత్యేక దృష్టి

జిల్లాలోని రైస్ మిల్లుల్లో సీఎంఆర్ బియ్యం నిల్వలు, రికార్డుల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆకస్మిక తనిఖీలతో రైస్ మిల్లుల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. తనిఖీల సమయంలో యజమాని అందుబాటులో లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్‌ లో ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారుల తనిఖీలు పూర్తయిన అనంతరం వాస్తవ పరిస్థితులు, రికార్డుల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే అంశంపై అధికారులు నుండి స్పష్టత రావాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>