ఢిల్లీ పేలుడు ఘటనను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఆర్‌పీఎఫ్(CRPF) ఐజీ రాజేష్ చెప్పారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తున్నామని అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ పేలుడు ఘటన స్థలాన్ని పరిశఈలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఘటనకు సంబంధించి అధికారిక సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు అందిస్తారు. ఢిల్లీ పోలీసులకు కావాల్సిన సహయ, సహాకారాలను అందిస్తాం. ఘటన స్థలంలో భద్రతను పెంచుతున్నాం. ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ పేలుడు వెనక ఎవరున్నారు అన్న అంశంపైన కూడా భద్రతా బలగాలు దృష్టి పెట్టాయి’’ అని చెప్పారు.
Read Also: ఢిల్లీ పేలుడు.. జమ్మూకశ్మీర్‌లో భారీగా తనిఖీలు
Follow Us on : Pinterest

