కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా నేడు రెండో దశ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) పోలింగ్ షురూ అయింది. 3911 సర్పంచ్ పదవులు, 29,917 వార్డుమెంబర్ పదవులకు పోలింగ్ జరగనుంది. రెండో దశ ఎన్నికల్లో 12782 మంది సర్పంచ్ పదవులకు, 71071 మంది వార్డు మెంబర్ స్థానాలకు పోటీ పడుతున్నారు. ఈ రెండో దశ ఎన్నికల్లో 57 లక్షల 22 వేల 465 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
Read Also: IPLలో రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో ఉండి.. అన్‌సోల్డ్‌గా మిగిలే ప్లేయర్లు ఎవరో ?
Follow Us On: X(Twitter)


