కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు తిరువళ్లూరు (Tiruvallur) లో ఘోర విషాదం చోటు చేసుకుంది. సీ ఫుడ్ ప్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీకై ఏడుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 70 మంది కార్మికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 23 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ యజమానితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు గ్యాస్ లీక్ ఘటనపై తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి (Tiruvallur) వెళ్లాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం.. సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. అంతేకాదు ప్రమాదంపై సీఎం విజయ్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. మూడు రోజుల్లో ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని త్రిసభ్య కమిటీని ఆదేశించారు.
Read Also: అడవి దారి లేక.. ఆగమవుతున్న నల్లమల గిత్త!
Follow Us On: Instagram

