పొలం పనులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. బురదలో విగతజీవిగా సింగరేణి కార్మికుడు!

కలం, ఖమ్మం బ్యూరో: రాత్రి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడి వెతికిన కుటుంబ సభ్యులకు పొలంలో బురదలో శవమై కనిపించి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసాడు ఓ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా గుండాల (Gundala) మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

​బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం.. గుండాల తండాకు చెందిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు (Singareni Worker) భూక్యా గోపాల్ శుక్రవారం కురిసిన వర్షానికి తన వ్యవసాయ పొలంలో దమ్ము కొట్టించేందుకు ట్రాక్టర్‌తో వెళ్లాడు. సాయంత్రం వేళ పనులు పూర్తయిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్‌ను ఇంటికి పంపించిన గోపాల్, పొలం వద్దే ఉండిపోయాడు. అయితే రాత్రి 10 గంటలవుతున్నా ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలాల వద్దకు వెళ్లి వెతకడం ప్రారంభించారు.

​ఈ క్రమంలో పొలంలోని బురదలో గోపాల్ విగతజీవిగా పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పొలం పనుల్లో ఉండగానే ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. కష్టపడి కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు అకస్మాత్తుగా అనంతలోకాలకు చేరడంతో, కుటుంబ సభ్యులతో పాటు గుండాల తండాలో శోకసంద్రం అలుముకుంది.

Also Read : నిరుద్యోగులను అవమానిస్తారా?: హరీశ్ రావు ఫైర్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>