Mobile Popup Ad
Mobile Popup Ad

రోడ్డెక్కిన రైతన్నలు.. యూరియా యాప్ తొలగించాలని డిమాండ్

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పలగాయి (Uppalgayi)లో రైతన్నలు రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ తొలగించాలని డిమాండ్ చేశారు. విత్తనాలు వేసే సమయంలో యూరియా కోసం ధర్నాలు చేయాల్సిన దుస్తితి ఏంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఉప్పలవాయి రామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో (Farmers Stage Road Protest) చేశారు. యూరియా యాప్ ని తీసేయాలని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే యాప్ రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎరువులు ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>