Mobile Popup Ad
Mobile Popup Ad

పాక్‌పై మరోసారి దుమ్మురేపిన భారత్.. స్క్వాష్‌లో వరుసగా మూడో ఆసియా టైటిల్!

కలం, వెబ్‌‌డెస్క్: ఆసియా డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌ (Asian Squash Championship) లో భారత జోడీ అభయ్ సింగ్ – వెలవన్ సెంథిల్‌కుమార్ (Abhay Singh – Velavan Senthilkumar) మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. ఫైనల్‌లో పాకిస్థాన్ జోడీ నాసిర్ ఇక్బాల్ – నూర్ జమాన్‌ను ఓడించి వరుసగా మూడో ఏడాది పురుషుల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలి గేమ్‌ను 7-11తో కోల్పోయిన భారత జంట ఆ తర్వాత అసాధారణ ఆటతీరుతో చెలరేగింది. రెండో గేమ్‌ను 11-7తో గెలిచిన అభయ్-వెలవన్, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 11-2తో ప్రత్యర్థులను చిత్తు చేసి 47 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించారు. గత ఏడాది ఫైనల్‌లోనూ ఇదే పాక్ జోడీని ఓడించిన భారత్, ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.

ఫైనల్‌కు ముందు క్వార్టర్ ఫైనల్లో జపాన్ జోడీని, సెమీఫైనల్లో మలేషియా జోడీని ఓడించి భారత ఆటగాళ్లు టైటిల్ పోరుకు చేరుకున్నారు. ఇక మహిళల డబుల్స్‌లో జోష్నా చినప్పా – రథిక సీలన్ జోడీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్నా – వెలవన్ జంట సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి. దీంతో పురుషుల డబుల్స్‌లో స్వర్ణం, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకాలతో భారత్ మూడు విభాగాల్లోనూ పతకాలు సాధించి ఆసియా వేదికపై మరోసారి తన సత్తా చాటింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>