కలం వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad) సమీపంలో గురువారం ఓ స్కూల్ బస్సు(School Bus) ప్రమాదానికి గురైంది. ముందున్న వాహనాన్ని తప్పించేందుకు యత్నించిన సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా, వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు.
నారాయణపేట జిల్లా మరికల్‌కు చెందిన ప్రైవేటు స్కూల్ బస్సులో విద్యార్థులను హైదరాబాద్‌లోని జలవిహార్‌కు తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వెనక నుంచి వచ్చిన కారు బస్సును ఢీకొట్టడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి కూడా అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోలీసులతో కలిసి ట్రాఫిక్‌ను క్లియర్ చేసి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also: హమ్మయ్య.. కుర్చీ తాత సేఫ్!
Follow Us On: Youtube


