కలం వెబ్ డెస్క్ : కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత వైరల్‌గా మారిందో అందరికీ తెలిసిందే. షేక్ అహ్మద్ పాషా అలియాస్ కుర్చీ తాత(Kurchi Thatha) అనే ముసలాయనే ఈ డైలాగ్ సృష్టికర్త. ఈ డైలాగ్ ఏ రేంజ్‌లో ఫేమస్ అయ్యిందంటే ఏకంగా సినిమాలో దీని మీద ఓ పాట కూడా రాసేశారు. ఆ పాట కూడా డైలాగ్ లాగే సూపర్ హిట్. ఇలా ఫేమస్ అయినా కుర్చీ తాత భిక్షాటన చేసుకుంటూనే జీవనం సాగించాడు. అయితే బుధవారం కుర్చీ తాత చనిపోయాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన జనం నిజమే అనుకొని బాధపడ్డారు.
కానీ, ఈరోజు కుర్చీ తాత(Kurchi Thatha) కెమెరా ముందుకు వచ్చి నేను చనిపోలేదంటూ ఫైర్ అయ్యాడు. బతికున్న వాడ్ని చనిపోయాడంటూ యూట్యూబ్‌లో ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను చనిపోయినట్లు వీడియో చేసిన వాళ్లు దొరికితే తానే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఏదేమైనా కుర్చీ తాత బతికే ఉన్నాడన్న వార్త విన్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: సీతాఫలం ఎంత అండర్‌రేటెడ్ ఫ్రూటో తెలుసా?
Follow Us On: Youtube


