కలం డెస్క్: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) సహకరించలేదని, మరోసారి కస్టడీకి అప్పగించాలని సుప్రీంకోర్టుకు (Supreme Court) తెలంగాణ సర్కారు చేసిన రిక్వెస్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ నెల 25 వరకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా వారం రోజులపాటు ఆయనను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినా కీలకమైన విషయాల్లో వాస్తవాలను వెల్లడించలేదని సుప్రీంకోర్టుకు తెలంగాణ తరఫు న్యాయవాదులు వివరించారు. గతంలో తరహాలోనే దాటవేశారని సుప్రీంకోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు (SIT) పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశం మేరకు వారం రోజుల పాటు ప్రభాకర్ రావు(Prabhakar Rao)ను సిట్ బృందం హైదరాబాద్‌లో ప్రశ్నించింది. ఐ-క్లౌడ్ (I-Cloud), జీ-మెయిల్ (Gmail) అకౌంట్లను ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ ల గురించి పోలీసులు ఆరా తీశారు. కానీ ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంతో మరోసారి కస్టడీలో విచారించాల్సి ఉన్నదన్న తెలంగాణ తరఫు న్యాయవాదనకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి ఈ నెల 25 వరకు కస్టడీని పొడిగించింది.
Read Also: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం, పాలమూరుకు నీటి కేటాయింపులపై చర్చ
Follow Us On: X(Twitter)


