కలం, వెబ్‌డెస్క్: ఎస్ఎల్‌బీసీ (SLBC) పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగంగా పూర్తిచేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఒప్పందాలు చేసుకోవడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ అధికారులను తీవ్రంగా ప్రశ్నించినట్లు సమాచారం.
ఎస్‌ఎల్‌బీసీ (SLBC Project) టన్నెల్ తవ్వకాల కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించాలని, పనులకు సంబంధించిన నిధుల చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతా తెరవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ ఖాతా ఓపెన్ చేయడానికి అవసరమైన సంతకాల విషయంలో సంబంధిత సంస్థ తమ ప్రతినిధుల పేర్లను ఇవ్వడం లేదని అధికారులు మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న సందిగ్ధత ఉందని వారు తెలిపారు.
దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, “మీకు భయం ఉంటే సంతకాలు నేనే చేస్తా” అంటూ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎస్ఎల్‌బీసీ పనుల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత కీలకమని, పనుల్లో నిర్లక్ష్యం సహించబోమని మంత్రి హెచ్చరించినట్లు సమాచారం.
Read Also: రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్న రాష్ట్రపతి
Follow Us On: Instagram


